Raviteja: రవితేజ సినిమాతో మళ్లీ రంగంలోకి బండ్ల గణేశ్!

Raviteja in Bandla Ganesh Movie

  • కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్ 
  • స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన తీరు 
  • కొంతకాలంగా సినిమాలకి దూరం 
  • గోపీచంద్ మలినేని - రవితేజ కాంబోను రిపీట్ చేస్తున్న బండ్ల   

ఒకప్పుడు బండ్ల గణేశ్ హాస్యనటులలో ఒకరిగా చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళ్లాడు. ఆ తరువాత కాలంలో నిర్మాతగా మారాడు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న బండ్ల గణేశ్, కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. 

అలాంటి బండ్ల గణేశ్ త్వరలో నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. నిర్మాతగా బండ్ల కెరియర్ మొదలైంది రవితేజ సినిమా 'ఆంజనేయులు'తోనే. అక్కడి నుంచే ఆయన నిర్మాతగా ఎదుగుతూ వెళ్లాడు. 

ఆ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకున్నాడో లేదో తెలియదుగానీ, మళ్లీ రవితేజతోనే సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని టాక్. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ ఉండటం వలన, మళ్లీ అదే కాంబినేషన్ ను బండ్ల సెట్ చేస్తున్నాడని అంటున్నారు. 

Raviteja
Gopichand Malineni
Bandla Ganesh
  • Loading...

More Telugu News