Lakshmi Priya: సుధాకర్ కోసం వస్తుండే ఆ వ్యక్తి చిరంజీవి అని అప్పట్లో నాకు తెలియదు: నటి లక్ష్మిప్రియ 

Lakshmi Priya Interview

  • కేరక్టర్ ఆర్టిస్టుగా లక్ష్మీప్రియకి మంచి పేరు 
  • పల్లెటూరు నుంచి తన ప్రయాణం మొదలైందన్న నటి 
  • తనతో కలిసి సుధాకర్ నాటకాలు వేసేవాడని వెల్లడి 
  • ఆయన కోసం చిరంజీవి వచ్చేవారని వివరణ   

లక్ష్మిప్రియ కేరక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలలో చేశారు. సీనియర్ స్టార్ హీరోలకి తల్లి పాత్రలలోను మెప్పించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను ఒక పల్లెటూరు నుంచి మద్రాసుకి వెళ్లాను. అక్కడ తొలిసారిగా సావిత్రిగారిని చూసినప్పుడు నా జన్మ ధన్యమైందని అనుకున్నాను. అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశాను" అన్నారు. 

"నేను .. కమెడియన్ సుధాకర్ కలిసి ఒక నాటకం వేయవలసి ఉంది. ఆ నాటకంలో నేను అక్క .. ఆయన తమ్ముడు. మేమిద్దరం కలిసి రిహార్సల్ చేస్తుండగా. సుధాకర్ కోసం ఒక వ్యక్తి వచ్చి వెయిట్ చేసేవారు. 'నేను పెద్ద హీరోనవుతాను' అనేది ఆ నాటకంలో సుధాకర్ డైలాగ్. అలాగే ఆ నాటకం తరువాత ఆయన హీరో అయ్యాడు" అని చెప్పారు. 

"కొన్ని రోజుల తరువాత 'అగ్ని సంస్కారం' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. జీవీ ప్రభాకర్ గారు దర్శకుడు. ఆ సినిమాలో హీరో చిరంజీవి అని చెప్పారు. సెట్లో ఆయనను చూసి షాక్ అయ్యాను. గతంలో సుధాకర్ కోసం వస్తుండే వ్యక్తి ఆయనే అని గ్రహించి ఆశ్చర్యపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.

Lakshmi Priya
Chiranjeevi
Sudhakar
  • Loading...

More Telugu News