KTR: ఏపీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్

KTR says all the best to AP

  • రేపటి నుంచి విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
  • ఏపీకి గుడ్ లక్ అంటూ కేటీఆర్ ట్వీట్
  • రెండు తెలుగు రాష్ట్రాలు గొప్పగా వెలుగొందాలని ఆకాంక్షించిన వైనం

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు, ఎల్లుండి ఈ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న యంగర్ బ్రదర్ వైజాగ్, తోటి సోదరి రాష్ట్రం ఏపీకి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. ఏపీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే గొప్ప రాష్ట్రాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. 

మరోవైపు ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ ను బిగ్ బ్రదర్ గా సంబోధించారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ లో ఏపీని ప్రమోట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. బిగ్ బ్రదర్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు.

ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ను కూడా కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. హైదరాబాద్ ను అమర్ నాథ్ బిగ్ బ్రదర్ అని సంబోధిస్తే... వైజాగ్ ను కేటీఆర్ యంగర్ బ్రదర్ అని అన్నారు. ఏపీ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

More Telugu News