: పదవిని వదలని శ్రీనివాసన్, దాల్మియా తాత్కాలికం
బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో తాత్కాలికి అధ్యక్షుడిగా జగ్ మోహన్ దాల్మియా ఎన్నికయ్యారు. అయితే శ్రీనివాసన్ రాజీనామా చేయలేదు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తు ముగిసే వరకూ బీసీసీఐ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని శ్రీనివాసన్ స్పష్టం చేసారు. దీనిపై దర్యాప్తు ముగిసిన వెంటనే తాను పదవీ బాధ్యతలు స్వీకరిస్తానని కూడా తెలిపారు. మరో వైపు జగ్దలే, షిర్కేల రాజీనామాలు వెనుకకు తీసుకోవాలని కోరారు. ఈమేరకు బీసీసీఐ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ వర్కింగ్ కమిటీలో ఎక్కువ మంది శ్రీనివాసన్ కు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.