Priyadarshi: పల్లె అందాలకు అద్దం పడుతున్న 'బలగం' పాట!

Balagam lyrical song released

  • పల్లె నేపథ్యంలో సాగే కథనే 'బలగం'
  • ప్రియదర్శి జోడీకట్టిన కావ్య కల్యాణ్ రామ్ 
  • సంగీతాన్ని అందించిన భీమ్స్ 
  • ఈనెల 3వ తేదీన సినిమా రిలీజ్

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన కూతురు ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, ఆ బ్యానర్లో ఫస్టు మూవీగా 'బలగం' సినిమాను నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో కుటుంబాలు .. అనుబంధాలు మధ్య నడిచే కథ ఇది. ప్రియదర్శి సరసన నాయికగా కావ్య కల్యాణ్ రామ్ నటించింది. 

 కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు. 'ఊరూ పల్లెటూరు .. దీని తీరే అమ్మ తీరు' అంటూ ఈ పాట సాగుతోంది. పల్లె అందాలు .. ఆ పల్లెతో పెనవేసుకుపోయిన బంధాలను గురించి నడిచే పాట ఇది.  

భీమ్స్ సంగీతాన్ని అందించిన ఈ పాటలకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చగా, రామ్ మిరియాల - మంగ్లీ ఆలపించారు. ఈ కథ అంత కూడా తెలంగాణ ప్రాంతంలో నడుస్తుంది .. ఆందుకు తగినట్టుగానే, తెలంగాణ యాసలోనే పాట సాగుతుంది.

More Telugu News