Virat Kohli: భార్యపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం

Virat Kohli praises Anushka Sharma

  • ఒక తల్లిగా అనుష్క ఎన్నో త్యాగాలు చేసిందన్న కోహ్లీ
  • జీవితాన్ని అనుష్క చూసే కోణం డిఫరెంట్ గా ఉంటుందని వ్యాఖ్య
  • ఏం జరిగినా అంగీకరిస్తూ ముందుకు సాగడాన్ని ఆమె నుంచే నేర్చుకున్నానన్న కోహ్లీ

ఇండియాలోని సెలబ్రిటీ కపుల్స్ లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జంట ఒకటి. ప్రేమ వివాహం చేసుకున్న వీరు... సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా తన భార్యపై కోహ్లీ మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. ఒక తల్లిగా ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని... ఆమె నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందుతున్నానని చెప్పాడు. తమ కూతురు వామిక తమ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయని... ఒక తల్లిగా ఆమెను చూసుకునే విషయంలో అనుష్క చేసిన త్యాగాలు చాలా గొప్పవని కితాబునిచ్చాడు. 

అనుష్కను చూస్తుంటే తన జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కోగలననే నమ్మకం కలుగుతుందని చెప్పాడు. జీవితాన్ని ఆమె చూసే కోణం చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిపాడు. అనుష్క తనకు చాలా విషయాలను నేర్పిందని... జీవితంలో ఏమి జరిగినా దాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగడమనేదాన్ని ఆమె నుంచే నేర్చుకున్నానని చెప్పాడు. మరోవైపు నాలుగేళ్ల తర్వాత 'చక్ దా ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Virat Kohli
Team India
Anushka Shetty
Bollywood
  • Loading...

More Telugu News