IFS officer: సింహం లాంటి ముఖం.. ఇది ఏ జంతువో చెప్పగలరా?
![IFS officer shares video of beautiful and rare animal found in Ladakh](https://imgd.ap7am.com/thumbnail/cr-20230301tn63ff0cffe2652.jpg)
- ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి కశ్వాన్
- లడఖ్ ప్రాంతంలో అందమైన, అరుదైన జంతువుగా పేర్కొన్న అధికారి
- లింక్స్ అంటూ బదులిస్తున్న యూజర్లు
జంతు ప్రపంచం చాలా పెద్దది. మనకు తెలిసిన జంతువులు చాలా తక్కువ. అలాంటి తెలియని ఓ జంతువు గురించి పరిచయం చేశారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్. ‘‘భారత్ లో ఓ అందమైన, అరుదైన జంతువు. లడఖ్ రీజియన్ లో.. చాలా మంది దీని గురించి విని ఉండరు. ఊహించండి?’’ అంటూ సదరు జంతువు వీడియోని పోస్ట్ చేశారు కశ్వాన్.