Chiranjeevi: 'మెగాస్టార్ కి కథ చెప్పిన గోపీచంద్ మలినేని!

Chiranjeevi in Gopichaand Malineni Movie

  • 'క్రాక్'తో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని 
  • 'వీరసింహారెడ్డి'తో దక్కిన బ్లాక్ బస్టర్
  • ఆయన కథకి చిరూ ఓకే చెప్పారంటూ టాక్ 
  • ముందుగా పట్టాలెక్కేది ఈ ప్రాజెక్టునే అంటూ ప్రచారం   

మొదటి నుంచి కూడా గోపీచంద్ మలినేని తన సినిమాల్లో మాస్ యాక్షన్ పాళ్లు ఉండేలా చూసుకుంటున్నాడు. మాస్ డాన్సులు .. డైలాగులతో పాటు కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఆ జాబితాలో 'డాన్ శీను' .. 'బలుపు' .. 'పండగ చేస్కో' వంటి సినిమాలు కనిపిస్తాయి.

ఇక ఆ మధ్య రవితేజ హీరోగా వచ్చిన 'క్రాక్' .. బాలయ్యతో చేసిన 'వీరసింహా రెడ్డి' సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. కథాకథనాల పరంగానే కాకుండా, పాటల పరంగా కూడా 'వీరసింహా రెడ్డి' మంచి మార్కులు కొట్టేసింది. సంక్రాంతి బరిలో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. 

ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన చిరంజీవికి ఒక కథను వినిపించాడనీ .. ఆ కథ మెగాస్టార్ కి బాగా నచ్చేసిందని అంటున్నారు. ఇద్దరు ముగ్గురు దర్శకులు చిరంజీవికి కథలు వినిపించినప్పటికీ, ఆయన గోపీచంద్ మలినేని సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకుని వెళ్లనున్నారని చెబుతున్నారు.  

Chiranjeevi
Gopichand Malineni
Tollywood
  • Loading...

More Telugu News