Suhas: సుహాస్ నిర్మాతగా 'యాంగర్ టేల్స్ ' .. హాట్ స్టార్ లో ఎప్పుడంటే ..!

AngerTales WebSeries

  • హాట్ స్టార్ నుంచి 'యాంగర్ టేల్స్'
  • నలుగురు వ్యక్తులు జీవన ప్రయాణమే కథ 
  • ప్రధానమైన పాత్రల్లో సుహాస్ .. బిందుమాధవి 
  • ఈ నెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలు

నటుడిగా సుహాస్ తనని తాను నిరూపించుకుంటూ ఎదుగుతున్నాడు. ఆయన హీరోగా చేసిన 'కలర్ ఫోటో' .. 'రైటర్ పద్మభూషణ్' సినిమాలకి మంచి పేరు వచ్చింది. దాంతో ఆయన హీరోగా మరిన్ని సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక వెబ్ సిరీస్ ను కూడా నిర్మించాడు. దాని పేరే 'యాంగర్ టైల్స్'.

ప్రభల తిలక్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో బిందు మాధవితో పాటు సుహాస్ .. తరుణ్ భాస్కర్ .. మడోన్నా సెబాస్టియన్ .. వెంకటేశ్ మహా ..  రవీంద్ర విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 9వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

నలుగురు వ్యక్తులు ఎన్నో ఆశలతో .. ఆశయాలతో తమ జీవన ప్రయాణాన్ని మొదలుపెడతారు. తమ కలలను నిజం చేసుకుంటూ, తాము అనుకున్నట్టుగా జీవించాలని అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వాళ్లు బ్రతకవలసి వస్తుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారనేదే కథ. ఇటీవల వదిలిన ట్రైలర్ కూడా ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతోంది. 

More Telugu News