Mahesh Babu: మహేశ్ మూవీలో నిన్నటి తరం బాలీవుడ్ బ్యూటీ!

Mahesh and Trivikram movie update

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ 
  • కెరియర్ పరంగా మహేశ్ కి ఇది 28వ సినిమా 
  • కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ రేఖ 
  • ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీతం - రామ్ లక్ష్మణ్ ఫైట్స్  

మహేశ్ బాబు తన 28వ సినిమాతో సెట్స్ పైకి వెళ్లాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. మరో కథానాయికగా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఇక తాజాగా ఒక కీలకమైన పాత్ర కోసం రేఖను తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ తన సినిమాల్లోని కీలకమైన పాత్రలకుగాను సీనియర్ హీరోయిన్స్ ను తీసుకుంటూ ఉంటాడు. అలా గతంలో ఆయన నదియా .. ఖుష్బూ .. టబూ వంటి వారితో కీలకమైన రోల్స్ ను చేయించాడు. అలాగే ఇప్పుడు మహేశ్ తో చేస్తున్న యాక్షన్ ఎంటర్టయినర్ కోసం రేఖను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

తమన్ సంగీతం .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. మహేశ్ బాబుకి ఇది ఫస్టు పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. రేఖ ఈ సినిమాలో చేయడమనేది నిజమే అయితే, తప్పకుండా అది ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణే అవుతుంది.

More Telugu News