Priyadarshi: మీరే నా బలం .. బలగం: హీరో ప్రియదర్శి

Balagam Pre Release Event

  • దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 'బలగం'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • దర్శకుడిగా కమెడియన్ వేణు తొలి ప్రయత్నం 
  • మార్చి 3వ తేదీన విడుదలవుతున్న సినిమా

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో 'బలగం' సినిమా రూపొందింది. హర్షిత్ రెడ్డి - హన్షిత నిర్మించిన ఈ సినిమాకి కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరో .. హీరోయిన్లుగా ప్రియదర్శి - కావ్య కనిపించనున్నారు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా .. సిద్ధూ జొన్నలగడ్డ స్పెషల్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును 'సిరిసిల్ల'లో నిర్వహించారు. ఈ వేదికపై హీరో ప్రియదర్శి మాట్లాడుతూ .. "కథ .. కథనం .. మాటలు .. పాటలు అన్నీ కుదిరిన సినిమా ఇది. సిరిసిల్ల వేదికగా దర్శకుడు వేణు ఈ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించాడు. స్థానికంగా ఉండే కళాకారులను ప్రోత్సహించాడు" అని అన్నాడు.

"ఇంత మంచి కథను తెరపైకి తీసుకురావడానికి ముందుకు వచ్చిన దిల్ రాజుగారికీ, మా ప్రయత్నాన్ని సపోర్టు చేయడానికి వచ్చిన కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక్కడికి తరలివచ్చిన జనాలే నా బలం .. బలగం. మీరంతా 3వ తేదీన థియేటర్స్ కి వెళ్లాలి .. ఈ సినిమాను సక్సెస్ చేయాలి" అంటూ చెప్పుకొచ్చాడు.

Priyadarshi
Kavya
Dil Raju
Balagam Movie
  • Loading...

More Telugu News