Sunil: పోలీస్ ఆఫీసర్ 'సత్య'గా సునీల్ .. బర్త్ డే పోస్టర్ రిలీజ్!

Katha Venuka katha Special Poster Released

  • ఈ రోజు సునీల్ పుట్టినరోజు 
  • విషెస్ చెప్పిన 'కథ వెనుక కథ' టీమ్
  • సంగీతాన్ని అందిస్తున్న శ్రావణ్ భరద్వాజ్ 
  • దర్శకత్వం వహిస్తున్న చైతన్య కృష్ణ  

సునీల్ తెలుగు తెరకి పరిచయమై 20 ఏళ్లు దాటిపోయింది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో కమెడియన్ గా .. హీరోగా .. విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన తనని తాను నిరూపించుకున్నాడు. ఎలాంటి పాత్రను ఇచ్చినా సునీల్ చేయగలడు అనే నమ్మకాన్ని కలిగించాడు.

అలాంటి సునీల్ నుంచి 'కథ వెనుక కథ' అనే సినిమా రానుంది. ఈ సినిమాలో సునీల్ 'ఏసీపీ సత్య' పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోజున సునీల్ పుట్టినరోజు కావడంతో, ఆయన పాత్రను పరిచయం చేస్తూ .. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను వదిలింది.

చూస్తుంటే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిందనే విషయం అర్థమవుతోంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. కేశవ దీపక్ .. సత్యం రాజేశ్ .. శ్రీజిత ఘోష్ .. రఘుబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

Sunil
Srijitha
Raghubabu
katha Venuka Katha Movie
  • Loading...

More Telugu News