Revanth Reddy: తాడిచెర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు?: రేవంత్ రెడ్డి

Revanth reddy fires on KCR

  • సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న రేవంత్
  • కార్మిక సంఘాలపై కేసీఆర్ కుటుంబం పెత్తనం చెలాయిస్తోందని విమర్శ
  • మోదీ నిర్ణయాలకు కేసీఆర్ సహకరించారని వ్యాఖ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కార్మికుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించడం లేదని అన్నారు. తాడిచెర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారని ప్రశ్నించారు. సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను శ్రీధర్ దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

బొగ్గు గని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసీ సంఘానికి హరీశ్ రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని... కార్మిక సంఘాలపై కేసీఆర్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. తొమ్మిదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలుగా ఉన్నాయని... అయితే ఇప్పుడు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలకు కేసీఆర్ సహకరించారని చెప్పారు.  

Revanth Reddy
Congress
KCR
TRS
  • Loading...

More Telugu News