SV Krishna Reddy: ఆ మాట నాతో అన్నందుకు సౌందర్య చాలా బాధపడింది: ఎస్వీ కృష్ణారెడ్డి

SV Krishna Reddy Interview

  • సౌందర్య చాలా వేగంగా ఎదిగిందన్న ఎస్వీ కృష్ణారెడ్డి 
  • అలీతో సినిమా చేయడానికి ఆమె ఒప్పుకోలేదని వ్యాఖ్య 
  • ఆ సినిమాకి నో చెప్పినందుకు ఆమె బాధపడిందని వివరణ 
  • అందువల్లనే ఆమె  ఆ పాట చేసిందని వెల్లడి   

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. కథాకథనాలు మాత్రమే కాదు, సంగీతంపై కూడా ఆయనకి మంచి పట్టుంది. అందువలన ఆయన సినిమాలలో మ్యూజికల్ హిట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి కృష్ణారెడ్డి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి, 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు' రెడీ అవుతోంది. 

తాజా ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యను గురించి ప్రస్తావించారు. "సౌందర్యను నా సొంత చెల్లెలి మాదిరిగా చూసుకునేవాడిని. తను ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఎదగాలని భావించేవాడిని. ఆమె కూడా చాలా వేగంగా స్టార్ డమ్ ను సంపాదించుకుని దూసుకుపోయింది. అంత బిజీలోను ఆమె 'శుభలగ్నం' సినిమాలో ఒక సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం ఆమె గొప్పతనం" అన్నారు. 

"సౌందర్యను అంతకుముందు ఒక సినిమాలో అలీ జోడీగా చేయమని అడిగాను. ఆయన జోడీగా చేయలేనని ఆమె చెబితే, ఆ పాత్రకి ఇంద్రజను తీసుకున్నాను. కానీ నాకు 'నో' చెప్పిన తరువాత అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ సౌందర్య బాధపడుతోందని ఆమె ఫాదర్ చెప్పారు. ఒక్క పాటలో చేయడానికైనా ఆమె రెడీగా ఉందని అన్నారు. అప్పుడు 'శుభలగ్నం'లో  'చినుకు చినుకు అందెలతో' పాట చేయించడం జరిగింది" అని చెప్పారు.


SV Krishna Reddy
Ali
Soundarya
Subhalagnam Movie
  • Loading...

More Telugu News