Junior NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. తారక్ కు కూడా అవార్డు ఇస్తామన్న హెచ్సీఏ

Junior NTR will receive awards from us soon says HCA

  • హెచ్సీఏ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి
  • తారక్ ను హెచ్సీఏ పట్టించుకోలేదంటూ అభిమానుల ఆగ్రహం
  • తారక్ ను ఆహ్వానించామని చెప్పిన హెచ్సీఏ

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా అన్ని చోట్లా అవార్డులను కొల్లగొడుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో సైతం ఈ చిత్రం ఐదు అవార్డులను కొల్లగొట్టింది. ఈ అవార్డుల ఫంక్షన్లో రామ్ చరణ్ సందడి ఎక్కువగా కనిపించింది. స్పాట్ లైట్ అవార్డును రామ్ చరణ్ అందుకున్నాడు. సోషల్ మీడియాలో చరణ్ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 

మరోవైపు హెచ్సీఏ అవార్డులపై తారక్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్సీఏ స్పందించింది. అవార్డుల కార్యక్రమానికి తాము జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించామని... అయితే, ఆయన ఇండియాలో షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలిపింది. తమ నుంచి ఆయన త్వరలోనే అవార్డులను స్వీకరిస్తారని చెప్పింది. ఈ వివరణతో తారక్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. 

Junior NTR
Ramcharan
Tollywood
HCA Awards

More Telugu News