Vijay Antony: మరో సంచలనానికి రెడీ అవుతున్న 'బిచ్చగాడు 2' .. రిలీజ్ డేట్ ఇదే!

Bichagadu 2 movie update

  • విజయ్ ఆంటోని నుంచి 'బిచ్చగాడు 2' 
  • కథానాయికగా అలరించనున్న కావ్య థాపర్ 
  • కీలకమైన పాత్రలో రితిక సింగ్ 
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్



విజయ్ ఆంటోని హీరోగా ఆ మధ్య వచ్చిన 'బిచ్చగాడు' తెలుగులో సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ ఆంటోని ఎవరన్నది అంతకుముందు ఇక్కడివారికి తెలియకపోయినా, కంటెంట్ లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా ఒక రేంజ్ లో ఆడేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'బిచ్చగాడు 2' నిర్మితమైంది. 

ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే కుతూహలాన్ని తెలుగు ప్రేక్షకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితం ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయన్నున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

విజయ్ ఆంటోని దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కావ్య థాపర్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రితిక సింగ్ .. రాధా రవి .. మన్సూర్ అలీఖాన్  కనిపించనున్నారు. ఫస్టు పార్టు మాదిరిగానే సెకండ్ పార్టు సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

More Telugu News