Priyadaarshi: తెలంగాణ నేపథ్యంలో నడిచే 'బలగం' .. ట్రైలర్ రిలీజ్!

Balagam Trailer Released

  • దిల్ రాజు బ్యానర్లో నిర్మితమైన 'బలగం'
  • ప్రియదర్శి జోడీగా కావ్య కల్యాణ్ రామ్ 
  • ప్రత్యేక ఆకర్షణగా భీమ్స్ అందించిన బాణీలు 
  • మార్చి 3వ తేదీన సినిమా విడుదల    


ప్రియదర్శి - కావ్య జంటగా రూపొందిన సినిమానే 'బలగం'. దిల్ రాజు ప్రొడక్షన్లో హర్షిత్ రెడ్డి - హన్షిత నిర్మించిన ఈ సినిమాకి, వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 3వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది తెలంగాణ ప్రాంతంలో .. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. హీరో - హీరోయిన్ మధ్య ప్రేమ .. హీరో బాకీతో ముడిపడిన అతని నిశ్చితార్థం .. ఆయన టెన్షన్ పడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

పల్లె అందాలు .. అక్కడి మనుషుల ఆత్మీయత .. వాళ్ల మాట తీరును ప్రతిబింబించేదిగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. ఇంతవరకూ తన బ్యానర్లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని దిల్ రాజు చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి. 

More Telugu News