Somu Veerraju: తిరుపతిలో సోమువీర్రాజును అడ్డుకున్న ఆప్ శ్రేణులు

AAP workers blocked Somu Veerraju convoy in Tirupati

  • మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడంపై అప్ శ్రేణుల నిరసన
  • తిరుపతిలో బీజేపీ, ఆప్ శ్రేణుల మధ్య ఘర్షణ
  • ఆప్ కార్యకర్తలను తరిమేసిన పోలీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో... దేశ వ్యాప్తంగా ఆప్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో భాగంగా తిరుపతిలో సైతం ఆప్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయ్ ను ఆప్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా ఆప్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముందు ఆప్ కార్యకర్తలు బైఠాయించారు. ఈ క్రమంలో ఆప్ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తరిమేశారు.

Somu Veerraju
BJP
Tirupati
  • Loading...

More Telugu News