Kollywood: ఆర్య సరసన పూజ హెగ్డే!

Pooja hegde to act with Aarya

  • ఆవారా సీక్వెల్ కు ప్లాన్ చేసిన లింగుస్వామి
  • హీరోగా కార్తి స్థానంలో ఆర్య
  • 2010లో వచ్చిన ఆవారా సూపర్ హిట్

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటు దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారు. అన్ని భాషల్లోనూ ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా కోలీవుడ్ నుంచి ఆమెకు మరో ఆఫర్ వచ్చింది. తమిళ హీరో ఆర్యకి జోడీగా నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. 2010లో కార్తి హీరోగా నటించిన ‘ఆవారా’ చిత్రం సూపర్‌‌ హిట్‌గా నిలిచింది. దీని దర్శకుడు లింగుస్వామి ఆవారాకు సీక్వెల్‌ చేయాలని నిర్ణయించాడు. 

సీక్వెల్ అంటే సహజంగా మొదటి భాగంలో చేసిన హీరో, హీరోయిన్లే ఉంటారు. కానీ, లింగుస్వామి ఈసారి కార్తి కాకుండా ఆర్యను హీరోగా ఎంచుకున్నాడు. అతని సరసన పూజ హెగ్డే నటించనుందని కోలీవుడ్‌ సమాచారం. లింగుస్వామి చెప్పిన కథ నచ్చడంతో పూజ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, పూజ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Kollywood
Pooja Hegde
Aarya
sequel
  • Loading...

More Telugu News