Laya: బాలకృష్ణగారి కాలు తొక్కగానే కోపంతో పేకప్ చెప్పేశారు: సీనియర్ హీరోయిన్ లయ

Laya Interview

  • కొంత కాలంగా నటనకి దూరంగా ఉన్న లయ
  • బాలయ్యతో షూటింగ్ గురించి ప్రస్తావన 
  • ఆయన చాలా సరదా మనిషి అంటూ వ్యాఖ్య 
  • ఆయనతో డాన్స్ చేయడం కష్టమని వెల్లడి   


నిన్నటి తరం కథనాయికగా మంచి పేరు తెచ్చుకున్న లయ, వివాహమైన తరువాత నటనకు దూరంగా ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్న ఆమె, తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "బాలయ్య బాబుతో 'విజయేంద్ర వర్మ' సినిమా చేశాను. ఆయనకి చాలా కోపం ఎక్కువనీ , చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అంతా చెప్పడంతో నాకు మరింత భయం ఎక్కువైంది" అన్నారు. 

"బాలకృష్ణగారితో ముందుగా సాంగ్ ప్లాన్ చేశారు. నేనూ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆయన నా వెనుకే ఉన్నారుగానీ .. నేను చూసుకోలేదు. డాన్స్ చేస్తూ ఆయన కాలు తొక్కేశాను. 'అయ్యోసార్' అంటూ వెనక్కి తిరిగాను. 'నా కాలు తొక్కుతావా .. పేకప్' అంటూ విసురుగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతే నేను మరింత హడలిపోయాను. నా వలన షూటింగు కేన్సిల్ అవుతుందని ఏడవడం మొదలుపెట్టాను". 

అంతే .. బాలకృష్ణ గారు నా దగ్గరికి వచ్చి .. సరదాకి అలా అన్నాను అనీ, కంగారు పడవలసిన పనిలేదని చెప్పారు. ఆ తరువాత ఆయన పట్ల నాకు గల భయాన్ని పోగొట్టడానికి జోకులు వేసి నవ్వించేవారు. బాలయ్య సార్ బయటికి కనిపించేదానికి పూర్తి భిన్నంగా ఉంటారు. హార్ట్ ఫుల్ గా మాట్లాడతారు. ఆయనతో డాన్స్ చేయడం చాలా కష్టం. అప్పుడు ఏదో మేనేజ్ చేసేశాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Laya
Actress
Balakrishna
Tollywood
  • Loading...

More Telugu News