Manchu Manoj: నా జీవితంలోకి మౌనిక రావడం నా అదృష్టం: మంచు మనోజ్

I am lucky to have Mounika in my life says Manchu Manoj
  • మార్చి 3న పెళ్లి చేసుకోబోతున్న మనోజ్, మౌనిక
  • మంచు లక్ష్మి నివాసంలో  సింపుల్ గా వేడుక
  • ఇప్పటికే మొదలైన పెళ్లి పనులు
యువ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మార్చి 3న వీరి పెళ్లి జరగనుంది. కొన్నేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్న మనోజ్, మౌనిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. మౌనిక తన జీవితంలో ఉండటం తన అదృష్టమని మనోజ్ అంటున్నాడు. గతేడాది మనోజ్-భూమా మౌనిక గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అప్పుడే వీరి ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. 

మనోజ్ అక్క మంచు లక్ష్మి నివాసంలో సింపుల్ గా కొంత మంది అతిథుల సమక్షంలో మార్చి 3న పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లికి సబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ, విభేదాలు రావడంతో 2019లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మౌనిక సైతం తన భర్తతో విడిపోయారు. కాగా మంచు మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల 'వాట్ ది ఫిష్' టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నట్టు వెల్లడించాడు.
Manchu Manoj
bhuma mounika
marriage
Mohan Babu
Manchu Lakshmi

More Telugu News