Anurag Thakur: చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి భేటీ

Anurag Thakur meeting with Chiranjeevi and Nagarjuna

  • చిరంజీవి ఇంటికి వెళ్లిన అనురాగ్ ఠాకూర్
  • సినీ పరిశ్రమ గురించి చర్చలు జరిపిన వైనం
  • అనురాగ్ ను శాలువా కప్పి సత్కరించిన చిరు

ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. నిన్న హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఈరోజు చిరంజీవి ఇంటికి వెళ్లారు. వీరి భేటీ చిరంజీవి నివాసంలోనే జరిగింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రిని చిరంజీవి శాలువా కప్పి సత్కరించారు. వినాయకుడి ప్రతిమను బహూకరించారు. తన నివాసానికి వచ్చిన అనురాగ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. 

సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ సినీపరిశ్రమ గురించి మీతో జరిపిన చర్చలు సంతోషం కలిగించాయని చెప్పారు. భేటీ సందర్భంగా అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు, రానున్నది ఎన్నికల కాలం కావడంతో వీరి భేటీపై ఆసక్తి నెలకొంది.

More Telugu News