Ramcharan: రామ్ చరణ్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. చరణ్ స్పందన ఇదే!

Ramcharan response for Anand Mahindras tweet

  • 'ఆర్ఆర్ఆర్'తో ఒక రేంజ్ కు వెళ్లిపోయిన చరణ్ ఇమేజ్
  • చరణ్ ను గ్లోబల్ స్టార్ అన్న ఆనంద్ మహీంద్రా
  • ప్రతి రంగంలో ఇండియా మెరుస్తోందన్న చరణ్

'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చరణ్ ను గొప్ప నటుడిగా యావత్ సినీ ప్రపంచం గుర్తించింది. హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా మన దేశ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం చరణ్ ను కొనియాడారు. చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అంటూ కితాబిచ్చారు. మహీంద్రా ప్రశంస పట్ల చరణ్ స్పందిస్తూ... 'థాంక్యూ సో మచ్ సార్. ప్రతి రంగంలో ఇప్పుడు ఇండియా మెరుస్తోంది. ఇప్పుడు టైమ్ ఇండియాదే' అని అన్నారు. 

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా ఐదు అవార్డులను కొల్లగొట్టడంతో 'ఆర్ఆర్ఆర్' పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు నాటునాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత సింగర్లు రిహాన్నా, లేడీ గాగా పాటలతో ఇది పోటీ పడుతోంది.

Ramcharan
Tollywood
Anand Mahindra
RRR

More Telugu News