Tollywood: గుమ్మడికాయ కొట్టిన ‘దాస్ కా ధమ్కీ’

DasKa Dhamki shot wrapped up

  • షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించిన చిత్ర బృందం
  • స్వీయ దర్శకత్వంలో విష్వక్సేన్ హీరోగా వస్తున్న సినిమా
  • హీరోయిన్ గా నటించిన నివేదా పేతురాజ్

‘ఫలక్ నుమా దాస్’ చిత్రంతో తనలోని దర్శకత్వ ప్రతిభను చాటుకున్న నటుడు విష్వక్సేన్. అతను మరోసారి మెగా ఫోన్ పట్టాడు. తాను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’.  విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 17నే విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో ఆలస్యం అవుతోంది. అయితే, ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని తెలిపింది. 

వేసవి కానుకగా మార్చి చివర్లో లేదంటే ఏప్రిల్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి  లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. రావు రమేష్, రోహిణి, పృథ్వీరాజ్, హైపర్ ఆది ఇతర కీలక పాత్రలు పోషించారు.

Tollywood
Vishwak Sen
DasKa Dhamki
shooting
wrapped up
  • Loading...

More Telugu News