Team India: నాపై విఫల నాయకుడు అనే ముద్ర వేశారు: విరాట్ కోహ్లీ

I was considered as a failed captain says Virat Kohli

  • కెప్టెన్ గా ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడంతో ఆ ముద్ర వేశారని వ్యాఖ్య
  • ఆ కోణంలో తనను తాను అంచనా వేసుకోనన్న విరాట్
  • జట్టు సంస్కృతిలో మార్పు తెచ్చానన్న భారత మాజీ కెప్టెన్

తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడంతో తనపై విఫల నాయకుడు అనే ముద్ర వేశారని  టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ చెప్పాడు. పలు టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్, ఫైనల్ చేరినప్పటికీ ప్రజలు వాటిని కూడా పరాజయాలుగానే చూశారన్నాడు.  కోహ్లీ సారథ్యంలో భారత్ 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేరింది. 2019 వరల్డ్‌కప్‌లో సెమీస్‌ కు వెళ్లింది. 2021 వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీ పడింది. కానీ, గత టీ20 వరల్డ్‌ కప్‌లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.

‘ఈ నాలుగు టోర్నీల తర్వాత కెప్టెన్‌గా నేను  విఫలమయ్యాననే ముద్ర వేశారు. అయితే ఆ కోణంలో నన్ను నేను ఎప్పుడూ అంచనా వేసుకోలేదు. అదే సమయంలో భారత జట్టు సంస్కృతిలో మార్పు తీసుకొచ్చా. అందుకు నేను గర్వ పడుతున్నా.  ఒక జట్టుగా మేం ఏం సాధించామో, మా ఆట తీరులో వచ్చిన మార్పులేంటో అందరూ చూశారు. మెగా టోర్నీలు ఓ సమయానికి మాత్రమే పరిమితం అవుతాయి. కానీ, జట్టు ఆటలో మార్పులు తెచ్చి, జట్లు సంస్కృతిని మార్చడం అనేది సుదీర్ఘ ప్రక్రియ. అది జరగాలంటే సమష్టి కృషి అవసరం. ఒక ఆటగాడిగా నేను వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

ఇక 2011 వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన  జట్టులో ఉండటం తన అదృష్టమని విరాట్‌ చెప్పాడు. సచిన్ టెండుల్కర్ తన ఆరో ప్రయత్నంలో ప్రపంచ కప్ నెగ్గాడని, కానీ, తాను ఆడిన తొలి ప్రపంచకప్ లోనే భారత్ విజేతగా నిలవడం తన అదృష్టం అన్నాడు.

  • Loading...

More Telugu News