Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించడానికి నువ్వెవరు?: లోకేశ్ పై వంశీ ఫైర్

Vallabhaneni Vamsi fires on Lokesh

  • జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలన్న లోకేశ్
  • టీడీపీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ అన్న వంశీ
  • చంద్రబాబుపైనా విమర్శలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ అడుగుతున్నాడని అన్నారు. 

టీడీపీ పార్టీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీ రామారావు... నీ తాత ఖర్జూరనాయుడు కాదు అంటూ వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి పిలవడానికి నువ్వెవరు అంటూ లోకేశ్ పై మండిపడ్డారు. 

ఈ సందర్భంగా వంశీ టీడీపీ అధినేత చంద్రబాబును కూడా విమర్శించారు. చంద్రబాబు తనను పశువుల డాక్టర్ అంటున్నాడని, తాను కూడా అదే రీతిలో విమర్శిస్తే భోరున విలపిస్తాడేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాం అనేవిధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని, గతంలో ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణలను రాష్ట్రంలో తిరగకుండా చంద్రబాబు నియంత్రించలేదా? అని ప్రశ్నించారు.

Vallabhaneni Vamsi
Nara Lokesh
Junior NTR
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News