Byreddy Rajasekar Reddy: ఈ ప్రాజెకు నిర్మాణాన్ని జగన్, కేసీఆర్ ఓ క్రికెట్ మ్యాచ్ లా  వీక్షిస్తున్నారు: బైరెడ్డి

Byreddy comments on Upper Bhadra project

  • అప్పర్ భద్ర ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బైరెడ్డి
  • రాయలసీమలో పాదయాత్ర
  • తెలుగు రాష్ట్రాల నీటివాటాలకు అన్యాయం జరుగుతుందన్న బైరెడ్డి

రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ క్రికెట్ మ్యాచ్ లా వీక్షిస్తున్నారని మండిపడ్డారు. 

ఈ ప్రాజెక్టుతో ఏపీ, తెలంగాణకు నీటి వాటాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. అప్పర్ భద్ర నిర్మాణాన్ని ఆపేలా జగన్, కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. వీరిద్దరూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాయలసీమ ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాలని కోరారు. ఈ ప్రాజెక్టు రూపుదాల్చితే రాయలసీమ ఎడారిలా మారడం తథ్యమని అన్నారు.

More Telugu News