Ram Charan: రామ్ చరణ్ నిజంగానే గ్లోబల్ స్టార్: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra terms Ram Charan a Global Star

  • హాలీవుడ్ లోనూ రామ్ చరణ్ మేనియా
  • రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటున్న క్రిటిక్స్, అభిమానులు
  • గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న రామ్ చరణ్

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కు ఇటీవల దాకా మెగా పవర్ స్టార్ అనే బిరుదు ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో గ్లోబల్ స్టార్ అనే కొత్త బిరుదు వచ్చి చేరింది. అంతా ఆర్ఆర్ఆర్ మహిమ. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ చిత్రం భారత్ లోనే కాకుండా... అమెరికా, జపాన్ వంటి దేశాల్లోనూ సంచలన విజయం సాధించింది. ఏకంగా, నాటు నాటు పాటతో ఆస్కార్ బరిలో నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించేలా చేసింది. 

ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన రామ్ చరణ్ పై అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు లభిస్తున్నాయి. జేమ్స్ కామెరాన్ వంటి దర్శక దిగ్గజం కూడా రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లోనూ చరణ్ నామినేషన్ పొందాడు. 

అంతేకాదు, గుడ్ మార్నింగ్ అమెరికా అనే ప్రఖ్యాత టీవీ షోలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించాడు. దాంతో రామ్ చరణ్ ను అందరూ గ్లోబల్ స్టార్ అనడం మొదలుపెట్టారు. దీనిపై భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. గుడ్ మార్నింగ్ అమెరికా సోషల్ మీడియా పోస్టును రీట్వీట్ చేసిన ఆయన... ఇతడు నిజంగానే గ్లోబల్ స్టార్ అంటూ కొనియాడారు.

More Telugu News