Trivikram Srinivas: పూజా హెగ్డేకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram Srinivas gifs car to Pooja Hegde

  • మహేశ్ బాబు సినిమాలో పూజాను తీసుకున్న త్రివిక్రమ్
  • అల్లు అర్జున్ తో చేయబోయే చిత్రంలో కూడా పూజానే
  • పూజాకు 2 కోట్ల ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని ప్రచారం

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే 'ఖలేజా', 'అతడు' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మహేశ్ బాబు 28వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కన్నడ భామ పూజా హెగ్డే నటిస్తోంది. 

మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ చేస్తున్న తదుపరి చిత్రంలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు తన ఫేవరేట్ హీరోయిన్ పూజాకు త్రివిక్రమ్ ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2 కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని చెపుతున్నారు. ఇందులో ఎంత నిజముందో తేలాల్సి ఉంది.

More Telugu News