RRR: 'ఆర్ఆర్ఆర్' విశ్వరూపం.. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఏకంగా 5 అవార్డులు సొంతం

RRR wins five awards in HCA

  • అంతర్జాతీయ వేదికలపై సైతం 'ఆర్ఆర్ఆర్' సత్తా
  • హెచ్సీఏ అవార్డుల్లో బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టిన వైనం
  • బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. తాజాగా ఈరోజు అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసి ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. 

బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, హెచ్సీఏ స్పాట్ లైట్ (విదేశాల్లో సైతం విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం) అవార్డులను సొంతం చేసుకుని మన తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకూ చాటింది.  

RRR
HCA Awards
Tollywood
Bollywood

More Telugu News