Nagarjuna: అందుకే నాగార్జునగారికి నాపై కోపం వచ్చింది: 'పంచాక్షరి' నిర్మాత

Producer Chandra Interview

  • 'పంచాక్షరి'తో నిర్మాతగా మారిన మేకప్ మేన్ 
  • నాగార్జున గారు మంచి మనిషి అని వ్యాఖ్య 
  • ఎంతో సాయం చేశారని వెల్లడి 
  • తన సమస్య అదేనని వివరణ

అనుష్క కథానాయికగా ఆ మధ్య వచ్చిన 'పంచాక్షరి' ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా ద్వారా ఒక మేకప్ మెన్ నిర్మాతగా మారాడు. ఆయన పేరే రామచంద్ర. తాజాగా ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. 

"మా బావ సుబ్బారావు గారు .. ఏఎన్నార్ గారికి మేకప్ మేన్ గా ఉండేవారు. ఆయన దగ్గర అసిస్టెంట్ గా నా కెరియర్ మొదలైంది. 'నిన్నే పెళ్లాడుతా' నుంచి నాగార్జునగారి పర్సనల్ మేకప్ మేన్ గా పనిచేస్తూ వచ్చాను. 'పంచాక్షరి' సినిమా నిర్మాణ సమయంలోను ఆయన నాకు ఎంతో సాయం చేశారు. ఆయన చాలా మంచి మనిషి . అలాంటి వ్యక్తి మళ్లీ నాకు తారసపడతారని అనుకోను" అని అన్నాడు.

"అయితే ఒకానొక దశలో నేను నాగార్జున గారిని గురించే ఆలోచన చేసేవాడిని. నా ఫ్యామిలీకి సంబంధించిన పనులను కూడా పట్టించుకునేవాడిని కాదు. అది ఒక మానసికపరమైన సమస్య అని డాక్టర్ చెప్పిన తరువాత నాగ్ సార్ దగ్గర పని మానేశాను. అయితే అసలు సంగతిని ఆయనతో చెప్పకుండా మానేయడం .. రాత్రి వేళలో కారులో చాలా దూరం జర్నీ చేస్తూ నేను ఇంటికి వెళ్లిపోవడం ఆయనకి కోపాన్ని తెప్పించింది" అని చెప్పుకొచ్చారు.     

Nagarjuna
Chandra
Tollywood
  • Loading...

More Telugu News