Kodali Nani: చంద్రబాబును జైల్లో లేదా పిచ్చాసుపత్రిలో పెట్టాలి: కొడాలి నాని

Kodali Nani comments on Chandrababu

  • పోలీసులను చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న కొడాలి నాని
  • చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్టున్నాడని ఎద్దేవా
  • పట్టాభిని గన్నవరంకు పంపింది చంద్రబాబేనని ఆరోపణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాల్సిన సమయం ఆసన్నమయిందని మంత్రి కొడాలి నాని అన్నారు. గన్నవరంకు వెళ్లిన చంద్రబాబు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల గురించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ అంతు తేలుస్తానని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. 

నారా లోకేశ్ బ్రెయిన్ లెస్ కిడ్ అని... తన పిచ్చి వాగుడుని చంద్రబాబుకు అంటించినట్టున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఆయనకు బాలకృష్ణ పూనినట్టున్నాడని అన్నారు. గన్నవరంకు పట్టాభిని పంపింది చంద్రబాబేనని ఆరోపించారు. గన్నవరం ఘటనలో టీడీపీ కార్యకర్తలకు చిన్న గీత కూడా పడలేదని చెప్పారు. చంద్రబాబును జైల్లో కానీ లేదా పిచ్చాసుపత్రిలో కానీ పెట్టాలని అన్నారు.

Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Balakrishna
Nara Lokesh
  • Loading...

More Telugu News