Army Of Eunuchs: అగ్నివీర్ స్కీమ్ పై బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Bihar Ministers Controversial Remark On Agniveer Scheme
  • అగ్నివీర్ స్కీమ్.. హిజ్రాల సైన్యాన్ని తయారు చేస్తుందన్న బీహార్ మంత్రి సురేంద్ర యాదవ్
  • 4.5 ఏళ్లలో ఎలాంటి ఆర్మీని సిద్ధం చేస్తారని ప్రశ్న
  • 25-26 ఏళ్లకే అగ్నివీర్ గా రిటైర్ అయ్యే వాళ్లను ఎవ్వరూ పెళ్లి కూడా చేసుకోరని వ్యాఖ్య
  • అగ్నివీర్ ఐడియా ఇచ్చిన వారిని ఉరి తీయాలంటూ మండిపాటు
బీహార్ మంత్రి, ఆర్జేడీ నేత సురేంద్ర యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ స్కీమ్.. హిజ్రాల సైన్యాన్ని తయారు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మీడియాతో మంత్రి సురేంద్ర మాట్లాడుతూ.. ‘‘సరిగ్గా 8.5 ఏళ్ల తర్వాత దేశంలో హిజ్రాల సైన్యాన్ని చేరుస్తారు. 8.5 ఏళ్ల తర్వాత ప్రస్తుత ఆర్మీలోని సైనికులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ అగ్నివీరుల శిక్షణ కూడా పూర్తికాదు’’ అని అన్నారు. 

‘‘మన ఆర్మీ ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠంగా ఉంది కదా.. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? 4.5 ఏళ్లలో ఎలాంటి ఆర్మీని సిద్ధం చేస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు. 25-26 ఏళ్లకే అగ్నివీర్ గా రిటైర్ అయ్యే వాళ్లను ఎవ్వరూ పెళ్లి కూడా చేసుకోరని చెప్పారు. ‘‘వాళ్ల (అగ్నివీరులు) కు 25-26 ఏళ్లు ఉన్నప్పుడు..  పెళ్లి సంబంధాలు వస్తాయి. అప్పుడు ఏం చెబుతారు? ‘నేను రిటైర్డ్ సైనికుడిని’ అని అంటారా? వాళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారు?’’ అని అన్నారు. అగ్నివీర్ ఐడియా ఇచ్చిన వారిని ఉరి తీయాలని సురేంద్ర యాదవ్ మండిపడ్డారు. అంతకన్నా చిన్న శిక్ష ఏదీ సరిపోదని అన్నారు.

అగ్నివీర్ స్కీమ్ ను గతేడాది జూన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసున్న వాళ్లు ఇందులో చేరేందుకు అర్హులు. త్రివిధ దళాల్లో వీరిని 4 నాలుగేళ్ల పాటు కొనసాగిస్తారు. వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తారు. మిగతా వారు రిటైర్ అవుతారు.
Army Of Eunuchs
Bihar Minister
Agniveer Scheme
Hijdon Ki Fauj

More Telugu News