Andhra Pradesh: మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP budget sessions starts from March 14

  • బడ్జెట్ సమావేశాలకు అనుమతినివ్వాలని గవర్నర్ కు ప్రభుత్వ ప్రతిపాదన
  • సమావేశాలకు ఆమోదం తెలిపిన గవర్నర్
  • బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం

మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 14వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను నిర్ణయిస్తారు. కనీసం 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతినివ్వాలని కోరుతూ గవర్నర్ కు ప్రతిపాదనలు పంపగా... కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఈ ఉదయమే అబ్దుల్ నజీర్ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Andhra Pradesh
AP Assembly Session
Budget
  • Loading...

More Telugu News