Nani: సినీ పరిశ్రమలో ‘బంధు ప్రీతి’పై స్పందించిన నాని

Nani opens up on nepotism compares himself with Ram Charan

  • బంధు ప్రీతిని ప్రోత్సహించేది అభిమానులేనన్న నాని
  • తమ ఆరాధ్య నటుల వారసులను పెద్ద తెరపై చూడాలన్నది వారి కోరికగా వెల్లడి
  • తనను రామ్ చరణ్ తో పోల్చుకున్న నటుడు

సినీ పరిశ్రమలో సొంతంగా బ్రాండ్ సృష్టించుకున్న నటుల్లో నాని ఒకరు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్న నటుడు. సినీ పరిశ్రమలో బంధు ప్రీతిపై తన మనసులోని మాటలను ‘నిజం విత్ స్మిత’ టీవీ షోలో నాని వెల్లడించాడు. సోనీ లివ్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి నానితో పాటు దగ్గుబాటి రానా కూడా హాజరయ్యాడు. బంధు ప్రీతిపై నాని, రానా మాట్లాడుతున్న ప్రోమో వీడియో సైతం ఇటీవల విడుదలైంది.

సినీ పరిశ్రమ నుంచే వచ్చిన వ్యక్తికి, బయటి వ్యక్తికి మధ్య వ్యత్యాసం గురించి కూడా నాని క్లుప్తంగా, స్పష్టంగా చెప్పాడు. రామ్ చరణ్ తేజ్ తో తనను పోల్చుకున్నాడు. ‘‘నా మొదటి సినిమాను లక్ష మంది ప్రజలు చూశారు. కానీ, రామ్ చరణ్ మొదటి సినిమాను కోటి మంది వీక్షించారు. బంధు ప్రీతిని ప్రోత్సహించేది అభిమానులే. ప్రజలు ఎప్పుడూ కూడా తాము ఆరాధించే వారి కుమారులు, కుమార్తెలను బిగ్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటారు’’ అని నాని చెప్పాడు. 

ప్రోమో వీడియోలో రానా సైతం బంధు ప్రీతి అంశంపై మాట్లాడుతూ.. ‘‘మీ తల్లిదండ్రులు సాధించిన విజయాలు, వారసత్వాన్ని మీరు కొనసాగించలేకపోతే, మీ కుటుంబానికి అపచారం చేసినట్టే’’ అని పేర్కొనడం గమనించొచ్చు.

Nani
actor
nepotism
reaction
nijam with smitha
Tv show

More Telugu News