Parashuram: విజయ్ దేవరకొండ ప్రాజెక్టును పరశురామ్ అందుకే పక్కన పెట్టాడట!

Karthi in Parashuram Movie

  • సంచలన విజయం సాధించిన 'గీత గోవిందం'
  • సీక్వెల్ ఆలోచన చేసిన పరశురామ్ 
  • అంతకంటే ముందుగా రంగంలోకి కార్తి 
  • నిర్మాతగా తెరపైకి దిల్ రాజు పేరు 

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించింది. ఆయనతో మరో సినిమాను చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం పరశురామ్ ప్రకటించాడు. దాంతో ఇది 'గీత గోవిందం' సినిమాకి సీక్వెల్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత అని తెలిసి ఆశ్చర్యపోయారు. 

'గీతగోవిందం' సినిమాను గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మించారు. సీక్వెల్ కూడా ఆ బ్యానర్ లోనే వస్తుందని అంతా అనుకున్నారు. అయితే దిల్ రాజు పేరు తెరపైకి రావడంతో, అంతా అయోమయంలో పడిపోయారు. ఆ తరువాత ఏం జరిగిందోగానీ ఈ ప్రాజెక్టు పక్కకి వెళ్లిపోయింది. 

తన తదుపరి సినిమాను కార్తితో చేయడానికి పరశురామ్ సన్నాహాలు చేసుకుంటున్నాడన్నది తాజా టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జూన్ నుంచి మొదలు కానుందని అంటున్నారు. శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరితో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఎంత లేదన్నా ఈ ఏడాది అంతా కూడా విజయ్ దేవరకొండ అందుబాటులో ఉండడు. అందువల్లనే కార్తి ప్రాజెక్టును పరశురామ్ ప్లాన్ చేశాడని అంటున్నారు. 

Parashuram
Vijay Devarakonda
Karthi
  • Loading...

More Telugu News