Joe Biden Falls On Planes Stairs: విమానం మెట్లు ఎక్కుతూ పడబోయిన బైడెన్.. వీడియో ఇదిగో!

Joe Biden Falls On Planes Stairs

  • ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ స్లిప్ అయిన బైడెన్
  • ముందుకు పడి.. మెట్లను పట్టుకుని లేచిన అమెరికా అధ్యక్షుడు
  • పోలండ్ నుంచి తిరుగుపయనమైన సందర్భంగా ఘటన 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ పడబోయారు. మెట్లు జారడంతో అలానే ముందుకు ఒరిగిపోయారు. ఉక్రెయిన్, పోలండ్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్లేందుకు సగం మెట్లను మెల్లగా ఎక్కిన బైడెన్.. మిగతావి ఎక్కుతుండగా స్లిప్ అయ్యారు. అలానే ముందుకు ఒరిగిపోయారు. చేతులతో మెట్లను పట్టుకుని నిలదొక్కుకుని పైకి లేచారు. తర్వాత విమానం అంచుకు చేరుకుని.. చెయ్యెత్తి అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయారు.

ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతుండగా మెట్లు జారి బైడెన్ పడిపోవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జార్జియా వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ బైడెన్ రెండుసార్లు తడబడినట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ వెల్లడించింది. 2022 మే నెలలో ఆండ్రూ ఎయిర్ బేస్ లో మెట్లు ఎక్కుతుండగా బ్యాలెన్స్ కోల్పోయారు. లాస్ ఏంజెలెస్ లో ‘సమ్మిట్ ఆఫ్ అమెరికా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మరోసారి మెట్లు ఎక్కడంలో తడబడ్డారు.

Joe Biden Falls On Planes Stairs
Air Force One
US President Joe Biden
Poland
Ukraine

More Telugu News