Naveen Chandra: తండ్రి అయిన హీరో నవీన్ చంద్ర

Actor Naveen Chandra became father

  • మగబిడ్డకు జన్మనిచ్చిన నవీన్ చంద్ర భార్య
  • ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని పంచుకున్న నవీన్
  • కొడుకును ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన నవీన్

విలక్షణమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా నవీన్ చంద్ర గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన భార్య ఓర్మా పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించాడు. తాను, ఓర్మా మగబిడ్డతో ఆశీర్వదించబడ్డాము అని నవీన్ ట్వీట్ చేశాడు. తన కొడుకును ఎత్తుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. తండ్రి అయిన శుభ సందర్భంలో నవీన్ చంద్రకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే... ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో నవీన్ చంద్ర చాలా బిజీగా ఉన్నాడు. హీరోగా ఓ బైలింగ్విల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన వాణీ భోజన్, అమృతా అయ్యర్ నటిస్తున్నారు.

Naveen Chandra
Tollywood
Father

More Telugu News