Nagashourya: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

Phalana Abbayi Phalana Ammayi Lyrical song released

  • నాగశౌర్య నుంచి మరో ప్రేమకథ
  • ఆయన జోడీకట్టిన మాళవిక నాయర్ 
  • అవసరాల దర్శకత్వం వహించిన సినిమా ఇది 
  • మెలోడీ సాంగ్ తో మంచి మార్కులు కొట్టేసిన ఆభస్ జోషి 

నాగశౌర్య కథానాయకుడిగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా రూపొందింది. విశ్వప్రసాద్ - పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమాకి, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. టైటిల్ ను బట్టి ఇది ప్రేమకథ అనే విషయం అర్థమవుతూనే ఉంది. పెద్దలతో ముడిపడిన ప్రేమకథ కావడం వలన ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కూడా చెప్పచ్చు.

మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కనులచాటు మేఘమా కాస్త ఆగుమా .. వెనుకరాని నీడతో రాయబారమా' అంటూ ఈ పాట సాగుతోంది. నాయకా నాయికలపై ఈ పాటను చిత్రీకరించారు. 

కల్యాణి మాలిక్ స్వరపరిచిన ఈ పాటకి లక్ష్మి భూపాల్ సాహిత్యాన్ని అందించగా, ఆభస్ జోషి ఆలపించాడు. హీరో హీరోయిన్ గడిపిన మధురమైన క్షణాలపై ఈ పాట ప్లే అవుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీ సాంగ్స్ లో ఈ పాటకి చోటు దొరుకుతుందనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News