Amani: డబ్బు కోసం నేను సినిమాల్లోకి రాలేదు: నటి ఆమని

Amani Interview

  • సీనియర్ డైరెక్టర్స్ తో చేసిన ఆమని
  • ఆనాటి హీరోయిన్స్ గురించిన ప్రస్తావన 
  • కమల్ తో నటిస్తానని అనుకోలేదన్న ఆమని 
  • తనకి పేరు ప్రతిష్ఠలు ముఖ్యమని వెల్లడి  

తెలుగులో స్కిన్ షో చేయకుండా హీరోయిన్ గా ఎదిగిన అతికొద్ది మందిలో ఆమని ఒకరుగా కనిపిస్తారు. తెలుగులో కె. విశ్వనాథ్ .. బాపు వంటి గొప్ప దర్శకులతో కలిసి పనిచేసిన ఘనత ఆమె సొంతం. అలాంటి ఆమని తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " ఒక మంచి సమయంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే నేను చేసుకున్న అదృష్టం" అని అన్నారు. 

"నేను .. రోజా .. రమ్యకృష్ణ .. సౌందర్య  చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. నా సినిమాలు చూసి వాళ్లంతా అభినందించేవారు. మా మధ్యలో ఎలాంటి ఇగో ప్రొబ్లెమ్స్ ఉండేవి కాదు. 'మిస్టర్ పెళ్లాం' నాకు అవార్డును తెచ్చిపెడుతుందనిగానీ, 'శుభ సంకల్పం'లో కమల్ గారి సరసన నటిస్తానని గాని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని చెప్పారు. 

" నేను ఎప్పుడూ కూడా కథ ఏమిటని గానీ .. ఎంత ఇస్తారని గాని అడగలేదు. నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలనేది .. ఎంత ఇవ్వాలనేది మేకర్స్ కి తెలుసు. అందువలన నేను ఎప్పుడూ వాటిని గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. హీరోయిన్ గా మంచి పాత్రలు చేయాలి .. మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ముందుకు వెళ్లాను" అని చెప్పుకొచ్చారు.

Amani
Actress
Tollywood
  • Loading...

More Telugu News