Tarakaratna: తారకరత్న చిన్న కర్మ... కుటుంబసభ్యుల భావోద్వేగం

Tarakaratna Chinna Karma

  • ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న చిన్న కర్మ
  • కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు
  • దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించిన బాలయ్య

నందమూరి తారకరత్న చిన్న కర్మ నిన్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, ఆయన భార్య అలేఖ్య రెడ్డి కుటుంబీకులు కూడా హాజరయ్యారు. తారకరత్న మరణం నుంచి వారెవరూ ఇంకా కోలుకోలేదు. అందరి ముఖాల్లో ఎంతో బాధ కనిపించింది. 

అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకుని వెక్కివెక్కి ఏడుస్తుంటే... ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. తారకరత్న భార్యను, పిల్లలను బాలయ్య ఓదార్చారు. నిన్నటి కార్యక్రమంలో కూడా బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. కార్యక్రమాన్ని మొత్తాన్ని తానే దగ్గరుండి నిర్వహించారు.  

Tarakaratna
Chinna Karma
Balakrishna

More Telugu News