Gautam Adani: అదానీ గ్రూప్ పై ఆరోపణలు.. తమ జీవితాలను నిలబెట్టిందంటున్న ట్రక్ డ్రైవర్లు

How Hindenburg report on Adani saved livelihoods of 7000 truck owners

  • హిమాచల్ ప్రదేశ్ లో అదానీ సిమెంట్ రెండు ప్లాంట్ల మూత
  • ట్రక్ డ్రైవర్ల అధిక చార్జీలకు వ్యతిరేకంగా నిర్ణయం
  • చివరికి 10-12 శాతం తగ్గింపుపై ఇరువురి మధ్య అంగీకారం

అదానీ గ్రూప్ పై ఆరోపణలు ట్రక్ డైవర్ల ఉపాధిని కాపాడడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా..! అయితే దీని నేపథ్యం గురించి తెలుసుకోవాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అదానీ సిమెంట్ కు చెందిన రెండు ఫ్యాక్టరీల నుంచి సిమెంట్ ను తరలించే ట్రక్ డ్రైవర్లకు, కంపెనీకి మధ్య రవాణా చార్జీల విషయంలో అంగీకారం కుదరలేదు. ట్రక్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నట్టు చెల్లింపులు చేయాల్సి వస్తే, ఫ్యాక్టరీలను నడిపించడం లాభదాయకం కాదని.. ప్రస్తుత చార్జీలను సగానికి తగ్గించాలని అదానీ సిమెంట్ వాదనగా ఉంది. రెండు ప్లాంట్ లను మూసివేస్తున్నట్టు కూడా అదానీ సిమెంట్ ప్రకటించింది.

దీంతో డిసెంబర్ 15 నుంచి అదానీ సిమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ, ఎట్టకేలకు అదానీ సిమెంట్ దిగొచ్చింది. ట్రక్ చార్జీలను కేవలం 10-12 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ట్రక్ డ్రైవర్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అదానీ గ్రూప్ తో పోరాడే విషయంలో అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక కీలక పాత్ర పోషించినట్టు ట్రక్ డ్రైవర్ల తరఫున చర్చలకు నాయకత్వం వహించిన రామ్ కృష్ణ శర్మ తెలిపారు. ముందు అయితే చర్చలకు అదానీ గ్రూప్ నిరాకరించింది. హిండెన్ బర్గ్ నివేదిక దేవుడు పంపిన సందేశంగా కొందరు నిరసన కారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News