Chitra: ఆ ఇద్దరూ కూడా నాకు భాషా పరమైన విషయాలను చెప్పేవారు: గాయని చిత్ర

Chitra Interview

  • గాయనిగా చిత్ర స్థానం ప్రత్యేకం
  • తన గురువు ఓమన్ కుట్టి గురించిన ప్రస్తావన 
  • తొలి ఛాన్స్ ఇళయరాజా ఇచ్చారని వెల్లడి  
  • సీనియర్స్ పాటలంటే ఇష్టమన్న చిత్ర

సుశీల .. జానకి తరువాత తెలుగు తెరకి పరిచయమైన మరో కొత్త స్వరమే చిత్ర. ఇళయరాజా స్వరకల్పనలో తొలి పాట పాడిన చిత్ర, ఆ తరువాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపించే చిత్ర, ఎంతగా పేరు ప్రతిష్ఠలను సంపాదించుకున్నప్పటికీ ఒదిగే ఉంటారు. అలాంటి చిత్ర తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే ఇష్టం. ఓమన్ కుట్టి గారి దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను. నాకు ఏ మాత్రం సమయం దొరికినా నా సంగీతం టీచర్ ను కలిసి వస్తుంటాను. సుశీల గారు .. జానకి గారు .. లతా మంగేష్కర్ గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. నేను ఏసుదాసు .. బాలుగారితో కలిసి ఎక్కువ పాటలు పాడాను. ఇద్దరూ కూడా నాకు భాషా పరమైన ఎన్నో విషయాలను చెప్పేవారు" అన్నారు. 

"బాలూగారిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఇండస్ట్రీకి ఒక పిల్లర్ వంటివారు. అలాగే సిరివెన్నెల గారిని పోగొట్టుకోవడం కూడా చాలా బాధాకరం. పాట రికార్డింగ్ సమయంలో ఆయన వచ్చి చాలా బాగా మాట్లాడేవారు. అలాంటివారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అంతో చెప్పుకొచ్చారు. 

Chitra
Balu
Yesudas
Tollywood
  • Loading...

More Telugu News