KA Paul: మహామహా నేతలే నా ముందు మోకరిల్లారు... కేసీఆర్ ఎంత?: కేఏ పాల్

KA Paul fires on KCR

  • కేసీఆర్ దొంగ అని రుజువు చేస్తా
  • నేను ప్రార్థిస్తే కేసీఆర్ నాశనం అవుతారు
  • నా సోదరుడి హత్య కేసును తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను నేరుగా ఎదుర్కోలేక, తన సోదరుడి హత్య కేసును తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోని మహామహా నేతలనే తన ముందు మోకరిల్లేలా చేశానని... తన ముందు కేసీఆర్ ఎంత? అని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ తనను చంపేస్తే తాను స్వర్గానికి వెళ్తానని... కానీ చేసిన అవినీతికి కేసీఆర్ మాత్రం నరకానికే వెళ్తారని అన్నారు. తాను ప్రార్థిస్తే చాలు కేసీఆర్ సర్వనాశనం అవుతారని చెప్పారు. దైవ దూతల మీద చేయి వేస్తే దేవుడు క్షమించడని... వైయస్ రాజశేఖరరెడ్డి, తన తమ్ముడు కూడా భూమి మీద నుంచి వెళ్లిపోయారని అన్నారు. కేసీఆర్ దొర కాదు... దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని చెప్పారు. 

KA Paul
KCR
BRS
YS Rajasekhar Reddy
  • Loading...

More Telugu News