Shamshabad Airport: బూట్ల కింద రూ. 8 కోట్ల బంగారం.. శంషాబాద్ విమానాశ్రయంలో దొరికిన ప్రయాణికులు!

Roughly Rs 8 Crore worth Gold seized in Shamshabad Airport

  • సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు
  • వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీలు
  • బూట్ల కింద దాచిన 15 కిలోల బంగారం స్వాధీనం
  • ఇటీవలి కాలంలో ఇంత బంగారం పట్టుబడడం ఇదే తొలిసారి

శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల ఎన్నడూ పట్టుబడనంత బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ. 8 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. 

ఈ క్రమంలో షూకింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో దాదాపు 15 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 7.90 కోట్లు ఉంటుందని తేల్చారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, మిగతా వారిని విచారిస్తున్నారు. కాగా, శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

More Telugu News