Vishal: త్రుటిలో నా చావు మిస్ అయిందంటూ.. వీడియో షేర్ చేసిన విశాల్

Actor Vishal missed accident in shooting

  • 'మార్క్ ఆంటోనీ' షూటింగ్ లో తప్పిన ప్రమాదం
  • అదుపు తప్పిన ట్రక్కు విశాల్ పక్క నుంచి వెళ్లిన వైనం
  • ఇంచ్ దూరంలో ప్రాణాపాయం తప్పిందన్న విశాల్

తమిళ సినీ హీరో విశాల్ తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటాడు. అంతేకాదు యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా నటించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో షూటింగ్ లొకేషన్లలో ఆయన గాయపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆయన మరో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

ప్రస్తుతం ఆయన 'మార్క్ ఆంటోనీ' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ లో అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు కింద పడి ఉన్న విశాల్ పక్క నుంచి వెళ్లింది. దీంతో, త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయం కాలేదు. దీనిపై విశాల్ స్పందిస్తూ...  క్షణకాలంలో, కొన్ని ఇంచుల దూరంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని... భగవంతుడికి ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదం తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నామని తెలిపాడు.

Vishal
Tollywood
Kollywood

More Telugu News