Actor Prabhu: ప్రముఖ తమిళ సినీ నటుడు ప్రభుకు అస్వస్థత

Lager Surgery to actor Prabhu

  • ప్రభు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు
  • లేజర్ సర్జరీ ద్వారా రాళ్ల తొలగింపు
  • ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన డాక్టర్లు

ప్రముఖ తమిళ సినీ నటుడు ప్రభు తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్నో తెలుగు చిత్రాలలో సైతం ఆయన నటించారు. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆయన తల్లడిల్లిపోయారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నై కొడంబాక్కంలోని మెడ్ వే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. 

అనంతరం లేజర్ సర్జరీ నిర్వహించి మూత్రపిండంలోని రాళ్లను తొలగించారు. ప్రభు ఆరోగ్యం నిలకడగా ఉందని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉండే అవకాశం ఉంది. మరోవైపు ప్రభు త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలు, ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Actor Prabhu
Health
Operation
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News