Payal Rajput: మళ్లీ పాయల్ కే ఛాన్స్ ఇచ్చిన 'RX 100' డైరెక్టర్!

Payal in Ajay Bhupathi Movie

  • అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం'
  •  గ్రామీణ నేపథ్యంలో .. హారర్ జోనర్లో నడిచే కథ
  • ఆల్రెడీ షూటింగు మొదలెట్టేసిన డైరెక్టర్ 
  • వేసవిలో విడుదల చేసే ఆలోచన


అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పటివరకూ వచ్చిన కంటెంట్ కి భిన్నంగా ఈ సినిమా ఉండటంతో, యూత్ కి కొత్తగా అనిపించింది. అలాగే ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ ను .. సాంగ్స్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. పాయల్ గ్లామర్ ను చూసి పొలోమంటూ మనసులను పారేసుకున్నారు. 

పాయల్ మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. అందువలన ఆమె హవా కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమెకి వరుసగా అవకాశాలైతే వచ్చాయిగానీ, వాటితో పాటు సక్సెస్ లు రాలేదు. అయినా ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూనే వస్తోంది. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన అజయ్ భూపతి, ఆ తరువాత 'మహాసముద్రం' చేయగా, ఆది పరాజయం పాలైంది. 

దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, నాయిక ప్రధానమైన కథను రెడీ చేసుకున్నాడు. ఈ కథకి 'మంగళవారం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. హారర్ జోనర్లో  .. విలేజ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆల్రెడీ షూటింగు మొదలెట్టేసిన ఆయన, వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నాడు. ఈ సినిమాతోనైనా ఈ ఇద్దరికీ హిట్ పడుతుందేమో చూడాలి.  

Payal Rajput
Ajay Bhupathi
Mangalavaram Movie
  • Loading...

More Telugu News