PavanKalyan: పవన్ జోడీగా పూజ హెగ్డేనే ఫైనల్ అట!

Pooja Hegde in Pavan Kalyan Movie

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న పూజహెగ్డే 
  • హరీశ్ శంకర్ తోను మూడో సినిమాకి రెడీ 
  • పవన్ తో సెట్స్ పైకి వెళుతున్న హరీశ్
  • ఏప్రిల్ నుంచి షూటింగు మొదలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవిందసమేత' .. 'అల వైకుంఠపురములో' వంటి రెండు సినిమాలలో నటించిన పూజ హెగ్డే, ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తోంది. ఆ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ మూడో సినిమాలో మహేశ్ బాబు జోడీగా ఆమె అలరించనుంది.

అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' .. 'గద్దలకొండ గణేశ్' వంటి సినిమాలు చేసిన పూజ హెగ్డే, ఆయనతో మరో సినిమా సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా సమాచారం. పవన్ హీరోగా హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను రూపొందించనున్నాడు. ఇందులోనూ పూజ మెరవనుంది. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమాను పట్టాలెక్కించి, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు. 'గబ్బర్ సింగ్' తరువాత పవన్ - హరీశ్ శంకర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉన్నాయి. 

More Telugu News