Delhi: ఆప్ దే ఢిల్లీ మేయర్ పీఠం.. షెల్లీ ఒబెరాయ్ విజయం!

Shelly Oberai elected as Delhi Mayor

  •  సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు జరిగిన ఎన్నిక 
  • బీజపీ అభ్యర్థి రేఖ గుప్తాపై ఆప్ అభ్యర్థి షెల్లీ 34 ఓట్ల తేడాతో గెలుపు
  • ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రాధాన్యతను ఇస్తానన్న షెల్లీ

ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకుంది. ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మేయర్ గా గెలుపొందారు. దాదాపు రెండు గంటల సేపు ప్రశాంతంగా కొనసాగిన ఓటింగ్ లో బీజేపీ అభ్యర్థి రేఖ గుప్తాను షెల్లీ ఒబెరాయ్ ఓడించారు. షెల్లీ 150 ఓట్లను సాధించగా రేఖకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, షెల్లీ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే ఆప్ కౌన్సిలర్లు విజయనినాదాలు చేశారు. 

గత డిసెంబర్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు ఎన్నిక జరిగింది. మరోవైపు షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ, లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Delhi
Mayor
Shelly Oberoi
BJP
  • Loading...

More Telugu News